Fasting

Fasting

Instead fasting (empty stomach) Actual word is Upvas and that means seating near. Seating near to own soul or God require full concentration (awakening of Susumna Nadi) which may disturbed while eating or full abdomen. Also food manipulate feeling according to nature of it’s ingredients.




Ekadashi fasting is observed on every 11th Tithi in Hindu calendar. There are two Ekadashi fasting in a month, one during Shukla Paksha and another during Krishna Paksha. Ekadashi fasting spans for three days. Devotees take single meal in the afternoon a day before fasting day to make sure there is no residual food in the stomach on next day. Devotees keep strict fast on Ekadashi day and break the fast on next day only after sunrise. Eating of all type of grains and cereals is prohibited during Ekadashi fasting. Devotees can choose to observe fasting without water, with only water, with only fruits, with one time latex food according to their will and body power. However it should be decided before starting the fast.

Do’s
  • Rise early, take a bath and wear fresh clothes.
  • Swadhyaya: Study of scriptures like Gita & go inward journey to find yourself.
  • Sadhana:
    • Do Dhyana (meditation).
    • One must maintain celibacy while fasting.
  • Seva
    • Reach out to the poor and needy, donate food, water or other essentials as much as you can.
    • Do good deeds.

Simple and best for EKADASHI FASTING: Start fasting with empty stomach & clean intestines/ bowels. Take only water and lemon for the Whole day today. Keep giving & working whole day without expectations, i.e keep serving Mother Nature, plants & all creatures.

Supplement it with gentle walking, smooth breathing/pranayamas (Nadisudhi and Bramari), Mediations, less talking, Silence.

Happy Tholi Ekadasi

తొలిఏకాదశి ఆషాడ శుక్ల ఏకాదశి – 1 జులై 2020

ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానాకాలం మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యమ దంష్ట్రిక (యముడి కోర). ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ. లంఖణం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి.

ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. ఈ ఏకాదశిని పద్మఏకాదశిగా కూడా పిలుస్తారు. ఈ యోగ నిద్ర అనేది భూమి పై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన.తద్వారా ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి.

భవిష్యోత్తరపురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు.

తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, తన శరీరము నుంచి జనింపజేసిన కన్యక నే “ఏకాదశి” అంటారు.ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు- మోహిని రూపంలో వచ్చి ఏకాదశిపూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. రైతులు ఆరోజున కచ్చితంగా పేలపిండి తింటారు. ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది.

ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక. ఏకాదశి అంటే పదకొండు. అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు. వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటినన్నటినీ ఒకటిగా చేసి, అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్దకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం.

పురాణ నేపథ్యం

ధర్మము తప్పని, సత్యసంధుడు అయిన రాజు మాంధాత. అతని రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది. దానితో ప్రజలు పడరాని పాట్లు పడుతుంటే అంగిరసుడు సూచన పై ఈ శయనైక ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు, దానితో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా వున్నారని పురాణాలు చెపుతున్నాయి. విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళతాడని పెద్దలు చెప్పగానే, నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది. విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, ఈ రోజు నుంచి దక్షిణదిక్కుకు వాలుతాడు. అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. దానినే సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించారు. సాక్షాత్తు భగవంతుడే నిద్రిస్తుంటే ఈ పూజలు ఎవరికి చేయాలి అనుకోవచ్చు. ఈ నెలలోనే ప్రకృతిలో, పర్యావరణంలో మార్పులు వస్తాయి. తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి, అనేక రోగాలు చుట్టుముడతాయి. ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై, దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియనిగ్రహాన్ని కలిగిస్తుంది. ఇంతేకాక కష్టపరిస్థితుల్లోను, భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఇందువలన కామక్రోధాదులను విసర్జించగలుగుతారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. అలా ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది. ఈ పండుగకు పేల పిండిని తినే ఆచారము ఉన్నది *పేలాలలో బెల్లాన్ని, యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారుచేస్తారు ఈ దినాన ప్రతి దేవాలయంలోను పేలా పిండిని ప్రసాదంగా కూడా ఇస్తారు.ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం. కావున శరీరానికి ఈ పిండి వేడిని కలుగజేయడమేగాక, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడటానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది…

*********

శయన ఏకాదశి.

జూలై నెల 1వ తారీఖున ఏకాదశి ఉన్నది. ఆషాఢ మాసము శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని (ఈ రోజున విష్ణువు శయనమునకు అంటే నిద్రకు ఉపక్రమిస్తాడు) శయన ఏకాదశి అంటారు. శాయన ఏకాదశికి, తొలి ఏకాదశి అని కూడా పేరు ఉన్నది. చతుర్మాస్యములలో వచ్చే 8 ఏకాదశి లలో ఇది మొదటిది కావడము వలన దీనిని తొలి ఏకాదశి అంటారు.

రెండువారాలకు ఒకటి చొప్పున సంవత్సరానికి 24 ఏకాదశి లు ఉంటాయి.

శారీరక, మానసిక బాధలను పోగొట్టుకోవడానికి ఏకాదశి మంచి రోజు.

ఆ రోజున ఉపవాసము చేసి రోగ నిరోధక శక్తిని అధికము చేసుకోవచ్చును.

ఏదైనా రోగానికి మందు లేనప్పుడు , ఉపవాసము చేసి రోగనిరోధక శక్తిని పెంచుకొని రోగము రాకుండా చేయడము లేదా రోగమును జయించే ప్రయత్నమును చేయవచ్చును.

రెండు వారములకు ఒకసారి ఏకాదశి రోజున చేసే ఉపవాసము మంచి ప్రయోజనాలను ఇస్తుంది.

మనము గుర్తు ఉంచు కోవాలి. ఉపవాసము అనేది ఒక వ్యాధిని తగ్గించడానికి చికిత్సా విధానము కాదు. కానీ శరీరములో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి చక్కగా ఉపయోగ పడుతుంది.

ఆ రోజున చేయవలసిన పని ఆహారమును తీసుకోక పోవడము లేక తగ్గించి తీసుకోవడము ( అలవాటును బట్టి ) మరియు ఆహారము తీసుకొనే సమయములలో నియంత్రణను పాటీంచడము.

ఎలా చేయాలి ? (What to do for Ekadasi)

జూన్ 30వ తారీఖున, సాయంత్రము 6.00 గంటలకల్లా ఆహారమును తీసుకోవాలి. తిన్న రెండు గంటలకు 2 గ్లాసులు గోరు వెచ్చటి నీరు త్రాగాలి.

తరువాత కూడా అవసరమును బట్టి నీరు తీసుకోవాలి. రాత్రి పది గంటల కల్లా పడుకోవాలి.

జూలై 1 వ తారీఖున ఏకాదశి.

పొద్దున 4 నుండి 5 గంటల మధ్యన నిద్రలేచి కాలకృత్యములు , వ్యాయములు , స్నానము పూర్తిచేసి 6 గంటలకు 2 గ్లాసులు గోరు వెచ్చటి నీరు త్రాగాలి.

ఆరోజు చేయగలిగిన వారు ఒక పూట లేదా రోజంతా ( ఇంతకు ముందు ఉన్న అలవాటును బట్టి ) ఉపవాసము చేయాలి.

ఉండగలిగిన వారు 10 గంటల పాటు నిర్జల ఉపవాసము చేయాలి. అనగా పొద్దున 6 గంటల నుండి సాయంత్రము 4 గంటల వరకునీరు కూడా తీసుకోకుండా ఉపవాసము చేయాలి. అందువలన శరీరానికి చక్కటి నిరోధక శక్తి వస్తుంది. ఇలా చేద్దాము అనుకొన్న వారు పొద్దున 6 గంటలకు 2 గ్లాసుల గోరు వెచ్చటి నీరు తాగాలి. మళ్ళీ సాయంత్రము నాలుగు గంటల తరువాత 2 గ్లాసుల గోరువెచ్చటి నీరు త్రాగాలి. అప్పటి నుండి సజల ఉపవాసము అనగా అవసరము మేర నీరు త్రాగుతూ ఉండాలి. వేసవి కాలం కాబట్టి, ఆరోగ్య పరిస్థితులను బట్టి, ఇంటిలో ఉన్న వేడి పరిస్థితులను బట్టి నిర్ణయము తీసుకొని మాత్రమే నిర్జల ఉపవాసము చేయాలి. వేసవికాలములో పని పరిస్థితులను బట్టి కుదరకపోతే నీరు తీసుకుంటూ ఉపవాసము చేయాలి.

ఒక పూట ఉపవాసము ఉందాము అను కొన్నవారు సాయంత్రము 6.00 గంటలకు కేవలము పండ్లను తిని ఉండ వచ్చును. లేదా సాత్వికమైన మితాహరము తీసుకోవాలి… గంట తరువాత అవసరము మేరా నీరు త్రాగుతూ ఉండాలి.

రాత్రి 10 గంటలలోపునే నిద్రపోవాలి.

ఉండగలిగిన వారు మరుసటి రోజు పొద్దున 6 గంటల వరకు ఉపవాసమును చేయవచ్చును. ( ఇంతకు ముందు ఉన్న అలవాటుని బట్టి మాత్రమే ఇలా చేయాలి).

దయచేసి గుర్తు ఉంచు కోవాలి. ఈ విధానము ఆచరించుటలో ఎవరికి వారే భాద్యులు. ఇది ఒక వ్యాధిని తగ్గించడానికి చికిత్సా విధానము కాదు. కానీ శరీరములో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి చక్కగా ఉపయోగ పడుతుంది.

బాలలు, గర్భవతులు, బిడ్డలకు పాలు ఇచ్చే తల్లులు, ఏదైనా అనారోగ్యము లేదా వ్యాధితో బాధపడే వారు ఇంకా దీర్ఘ కాలిక రోగములు ఉన్నవారు…. ఆహారము నియంత్రించే ఉపవాసములు చేయక పోవడము మంచిది.

మొదటి సారి చేస్తున్న వారికి ఈ విధానము ఆచరించుటలో ఒక వేళ మనస్సు , శరీరము సహకరించక పోతే భాదపడవలసినది ఏమీ లేదు. మరలా వచ్చే ఏకాదశి నాటి నుండి ప్రయత్నము మొదలు పెట్టవచ్చును.

స్వయముగా ఆచరించి ఎవరికి వారు ఉపవాస ఫలితములను తెలుసుకోవాలి.